NTR-Neel: ఎట్టకేలకు ఎన్టీఆర్-నీల్ చిత్రం ప్రారంభం 1 y ago
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రానున్న భారీ యాక్షన్ సినిమా 'డ్రాగన్' షూటింగ్ మొదలైంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. టోవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించగా.. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైంది. బాలీవుడ్ మూవీ 'వార్ 2' షూటింగ్ పూర్తి కాగా, ఎన్టీఆర్ 'డ్రాగన్' పైనే దృష్టి పెట్టారు. షూటింగ్ మొదటి రోజే 200 మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలు ప్లాన్ చేసాడు ప్రశాంత్ నీల్.